Friday, December 20, 2024

కేరళ మాజీ డిజిపి శ్రీలేఖ బిజెపిలో చేరిక

- Advertisement -
- Advertisement -

కేరళ క్యాడర్‌కు చెందిన మొదటి మహిళా ఐపిఎస్ అధికారి, మాజీ డిజిపి ర్ శ్రీలేఖ బుధవారం బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్, జిల్లా అధ్యక్షుడు వివి రాజేష్ నుంచి తన నివాసంలో ఆమె పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. పార్టీలో శ్రీలేఖ చేరిక పట్ల సురేంద్రన్ హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు అధికారిగా మచ్చలేని జీవితాన్ని గడిపి డిజిపిగా రిటైర్ అయిన శ్రీలేఖ అనుభవం తమ పార్టీకి ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అశాభావం వ్యక్తం చేశారు. చాలా మంది ప్రముఖ వ్యక్తులు బిజెపిలో చేరుతున్నారని,

మీరు మాత్రం బిజెపిని అంటరానిపార్టీగా చిత్రీకరిస్తున్నారని ఆయన మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు పరిస్థితి మారిందని, 2026లో కేరళలో అధికారంలోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నామని సురేంద్రన్ చెప్పారు. తమ పార్టీలో చేరాలని కోరుతూ బిజెపి నాయకులు చేసిన ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడానికి తనకు మూడు వారాలు పట్టిందని శ్రీలేఖ తెలిపారు. బిజెపిలో తాను చేరడానికి ప్రధాని నరేంద్ర మోడీయే స్ఫూర్తని ఆమె చెప్పారు. పార్టీ నుంచి తాను ఏమీ ఆశించడం లేదని, ప్రజలకు సేవ చేసేందుకు ఇది మరో అవకాశంగా భావిస్తున్నానని ఆమె చెప్పారు. బిజెపి సిద్ధాంతం నచ్చే తాను పార్టీలో చేరానని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News