Wednesday, October 16, 2024

లంచగొండి భార్యను పట్టించిన భర్త

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/నార్సింగి: ఉన్నతమైన ఉద్యోగం, మంచి నెలసరి జీతం, అందమైన కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవించాలనుకున్న భర్త ఆశలపై నీరుజల్లి అతని ఆశలను అడియాశలు చేసింది,కట్టుకున్న భార్య. ప్రేమించి పెళ్ళి చేసుకున్న పాపానికి నిత్యం నరకం అనుభవిస్తూ ఇక తన వల్ల కాదని భార్య అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేసాడు భర్త. వివరాలకు గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీలో డిఈఈగా విధులు నిర్వహిస్తున్న దివ్యజ్యోతి, అవినీతి ముసుగులో లంచగొండిగా మారి విచ్చలవిడిగా కాంట్రాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తూ వారి వద్ద నుండి కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్న-దని ఆమె భర్త శ్రీపద్ పేర్కొంటూ వారి ఇంట్లో పలు చోట్లలో అక్రమంగా దాచిన కోట్లాది రూపాయల డబ్బుల కట్టలను వీడియోల ద్వారా భర్త సామాజిక మాద్యమాలలో చూపించటం స్థానికంగా కలకలం రేపింది. గత నెలలో వీరు విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

గత మూడు సంవత్సరాలుగా మణికొండ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తూ, మున్సిపాలిటీలో అభివృద్ధ్ది పనుల కోసం కేటాయించిన కోట్లాది రూపాయలను ఇష్టానుసారంగా తనకు నచ్చిన కాంట్రాక్టర్ల ద్వారా తక్కువ మెత్తంలో టెండర్లను వేయించి, వారికే టెండర్లు దక్కేలా చేస్తూ ఆ శాఖలో ఏఈ, డిఈఈ గా తానే ఏకచక్రాధిపత్యం వహిస్తూ, ఏకంగా మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగి భర్తతో కుమ్మక్కై ఆతనికే ఎక్కువ మెత్తంలో కాంట్రాక్టులు వచ్చేలా చేస్తూ కోట్ల రూపాయల సొమ్మును కాజేసేదన్నారు. అంతే కాకుండా గతంలో కౌన్సిల్ లో కోటి రూపాయలతో తీర్మానం చేస్తే దానిని నాలుగున్నర కోట్లకు చూపటంతో కొందరు కౌన్సిలర్లు కలిసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేసారన్నారు. తాను చేస్తున్న అవినీతిని బయటపెడతానని భర్త హెచ్చరించటంతో తన అవినీతి బయటపడుతుందని భావించిన తాను 3 రోజుల క్రితమే జిహెచ్‌ఎంసి కార్యాలయానికి బదిలీ చేయించుకున్నదన్నారు.

తనకు ధన దాహమే తప్ప తనకు మరో ఆలోచన ఉండేది కాదని, చిన్న బాబుని కూడా పట్టించుకోకుండా అర్థరాత్రి సమయాలలో ఇంటికి వచ్చేదని, తాను ఉద్యోగం చేస్తానన్న వద్దని వారించి గోడవ చేస్తూ, కోట్ల రూపాయల డబ్బులను తన సోదరులకు అందించేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే మణికొండ మున్సిపాలిటీలో పలు శాఖలలో అవినీతి తిమింగళాలు పట్టుబడుతున్న ఇంత దర్జాగా అనినీతికి పాల్పడటం వెనుక దాగి ఉన్న పెద్దలు ఎవరని స్థానిక ప్రజలలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికైనా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడిన వారిపైన తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పేర్కోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News