Friday, January 3, 2025

మెదక్ లో ఎస్ఐ వేధింపులు… మహిళా ఎఎస్ఐ ఆత్మహత్యాయత్నం… వీడియోలు వైరల్

- Advertisement -
- Advertisement -

మెదక్: ఎస్ఐ వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ లోనే మహిళా ఎఎస్ఐ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మెదక్ జిల్లాలోని చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఎస్ఐ యాదగిరి వేధిస్తున్నారంటూ ఎఎస్ఐ సుధారాణి ఆవేదన వ్యక్తం చేసింది. విధులు సక్రమంగా నిర్వహిస్తున్న విధులకు హాజరుకావడంలేదని కానిస్టేబుల్స్ తో అటెండెన్స్ వేయిస్తున్నట్లు ఎఎస్ఐ సుధారాణి ఆరోపణలు చేసింది. కావాలని ఎస్ఐ యాదగిరి కక్షపూరితంగా దుర్భాషలడుతూ తనను మానసికంగా వేధిస్తున్నాడని పోలీస్ స్టేషన్ లో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె సూసైడ్ లేటర్ కూడా రాసింది.  పోలీస్ సిబ్బంది చికిత్స కోసం ఆమెను జోగిపేట ఆసుపత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న మహిళా ఎఎస్ఐకి రక్షణ లేకపోతే సాధారణ మహిళలకు ఎలా రక్షణ కల్పిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రక్షకులే భక్షకులుగా మారుతున్నాదని నెటిజన్లు మండిపడుతున్నారు.  దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో సుధరాణి ఆత్మహత్య చేసుకుంటున్నానని ముగ్గురు ఎస్ఐలను బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News