Friday, December 20, 2024

టాటా సామ్రాజ్యానికి ఇక వారసులెవరు?

- Advertisement -
- Advertisement -

ముంబై: రతన్ టాటా ఇక లేరు. ఇప్పుడు ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసెలెవరనేది తేలాల్సి ఉంది. రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా కుమార్తె మయా టాటా(34), ఆమె సోదరుడు నెవిల్లే టాటా(32), వారి సోదరి లీ టాటా(39) పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. వ్యాపార దక్షత, వయస్సులో పెద్ద వారికే ఆ బాధ్యత దక్కితే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు. ఇక ఈ ముగ్గురు వారసుల విషయానికి వస్తే…

నోయెల్ టాటా కుమార్తె అయిన మయా టాటా తన కెరీర్ ను ‘టాటా అపార్చ్యూనిటీ ఫండ్’ తో ప్రారంభించారు. ‘టాటా న్యూ’ అనే యాప్ ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె తన తోబుట్టువులతో కలిసి టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తున్నారు.

మయా టాటా సోదరుడైన నెవిల్లే టాటా కుటుంబ వ్యాపారంలో నిమగ్నమై ఉన్నాడు. ఆయన టయోటా కిర్లోస్కర్ గ్రూప్ వారసురాలు మాన్సీ కొర్లోస్కర్ ను వివాహం చేసుకున్నారు. వారి కుమారుడు జంషెడ్ టాటా. ట్రెంట్ లిమిటెడ్ కింద టాటా స్టార్ బజార్ అనే హైపర్ మార్కెట్ చైన్ ను నిర్వహిస్తున్నారు.జుడియో, వెస్ట్ సైడ్ బాధ్యతలు కూడా ఆయన చేతుల్లోనే ఉన్నాయి.

మయా టాటా సోదరి లీహ టాటా తాజ్ హోటల్స్, ప్యాలెస్ లలో పనిచేశారు. ప్రస్తుతం టాటా గ్రూప్ లో భాగమైన ఇండియన్ హోటల్ కంపెనీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఆమె దృష్టంతా హోట్ పరిశ్రమ పైనే నిమగ్నమై ఉంది. చూద్దాం ఎవరు వారసులవుతారో.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News