- Advertisement -
వారం రోజుల్లో ఢిల్లీలో రెండవసారి భారీ మొత్తంలో కొకైన్ పట్టుబడింది. రమేష్ నగర్‌లో ఒక డ్రగ్స్ ముఠాను ఛేదించిన స్పెషల్ సెల్ పోలీసులు రూ. 2,000 కోట్ల విలువేసే 200 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిపిఎస్ ద్వారా డ్రగ్స్ సరఫరాదారుడి ఆచూకీని కనిపెట్టిన పోలీసులు పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్‌లో అతడి స్థావరంపై దాడి చేశారు. అయితే నిందితుడు తప్పించుకుని లండన్‌కు పారిపోగా భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. ఢిల్లీ పోలీసులు ఇదే వారంలో రూ. 7,500 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఒకే ముఠాకు చెందినవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. గత వారం దేశ రాజధానిలో 500 కిలోలకు పైగా కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
- Advertisement -