Tuesday, April 1, 2025

అనంతపురంలో ట్యాంకర్ ను ఢీకొట్టిన తెలంగాణ ఆర్‌టిసి బస్సు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మంపేట గ్రామ శివారులో జాతీయ రహదారి 44పై గురువారం అర్థరాత్రి దాటిన 1.40 నిమిషాలకు ట్యాంకర్ ను తెలంగాణకు చెందిన ఆర్‌టిసి బస్సు ఢీకొనడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. పోలీసులు , హైవే పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ట్యాంకర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మిగితా ప్రయాణికులను ఇతర బస్సుల్లో హైదరాబాద్‌కు తరలించారు. ట్రాఫిక్ అంతరాయ కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించామని సిఐ కౌలుట్లయ్య, ఎస్‌ఐ గౌస్ బాషా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News