Wednesday, October 16, 2024

రతన్ టాటా వారసుడు ఎవరు?

- Advertisement -
- Advertisement -

రేసులో ముందు వరుసలో మారు తమ్ముడు నోయెల్ టాటా
వేర్వేరుగా టాటా సన్స్, టాటా ట్రస్ట్ చైర్మన్ పదవులు
13 ట్రస్టీల ఏకాభిప్రాయంతో తుది నిర్ణయం

టాటా చైర్మన్ పదవి పోటీలో ముందున్న నోయెల్

రతన్ టాటా మారు తమ్ముడు నోయెల్ టాటా తన కుటుంబ సంబంధాలు, అనేక గ్రూప్ కంపెనీలలో ప్రమేయం కారణంగా టాటా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి బలమైన పోటీదారుగా ముందు వరుసలో ఉన్నారు. నావల్, సైమన్ టాటా కు మారుడు నోయెల్ ట్రెంట్ వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్స్ మరియు టాటా ఇంటర్నేషనల్‌కు చైర్మన్‌గా ఉన్నారు. టాటా స్టీల్ వైస్ చైర్మన్, సర్ రతన్ టాటా ట్రస్ట్ బోర్డులో ఉన్నారు. రతన్ టాటా సోదరుడు నోయెల్ నావల్ టాటాకు గ్రూప్‌లోని చాలా కంపెనీ ల్లో వాటా ఉంది. నోయెల్ నావల్ టాటా పి ల్లలు లియా, మాయా, నెవిల్లే ఇతర ప్రొఫెషనల్స్‌గా కంపెనీలో పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె లియా టాటా స్పెయిన్ నుండి మార్కెటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.

న్యూఢిల్లీ : టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టా టా (86) బుధవారం రాత్రి 11:30 గంటలప్రాంతంలో కన్నుమూశారు. రతన్ టాటా నిష్క్రమణ తర్వాత ఇప్పుడు 165 బిలియన్ డాలర్ల టాటా గ్రూప్ వారసుడు ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. ర తన్ టాటా చనిపోయేంత వరకు తన వారసుడిగా ఎవరినీ నియమించలేదు. ఈ నిర్ణయాన్ని ట్రస్టీల బోర్డుకే వదిలేశారు. అయితే ప్రస్తుతం ఎన్ చంద్రశేఖరన్ గ్రూప్‌లోని అతిపెద్ద కంపెనీ అయిన టాటా సన్స్‌కు చైర్మన్‌గా ఉన్నారు. అయితే దీనికి పైన టాటా కుటుంబ సభ్యుల నేతృత్వంలోని టా టా ట్రస్ట్ ఉంది. చనిపోయే వరకు రతన్ టాటా ట్రస్ట్ అధినేతగా ఉన్నారు. టాటా ట్రస్ట్ ఇది టా టా గ్రూప్ స్వచ్ఛంద సంస్థల సమూహం, ఇది రూ.13 లక్షల కోట్ల ఆదాయంతో టాటా గ్రూప్ లో 66 శాతం వాటాను కలిగి ఉంది. దీని కింద సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ టాటా సన్స్‌లో 52% వాటాను కలిగి ఉన్నాయి.
రెండింటికీ చైర్మన్‌గా రతన్ టాటా
టాటా గ్రూప్ చరిత్రలో టాటా సన్స్, టాటా ట్రస్ట్ రెండింటికీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన చివరి వ్యక్తి రతన్ టాటానే అవుతారు. 2022లో కంపెనీ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్‌ను సవరించారు, ఒకే వ్యక్తి రెండు పదవులను కలిగి ఉండకుండా నిషేధిస్తూ, పాలనా నిర్మాణంలో మా ర్పులు తీసుకొచ్చారు.
రతన్ తమ్ముడు జిమ్మీ 25ఏళ్ల క్రితమే రిటైర్మెంట్
రతన్ తమ్ముడు జిమ్మీ టాటా దాదాపు 25 ఏళ్ల క్రి తమే పదవీ విరమణ చేశారు. రతన్ టాటా త మ్ముడు జిమ్మీ టాటా ముంబైలో నివసిస్తున్నారు, కానీ ఆయన 90వ దశకంలోనే రిటైర్ అయ్యారు. ఆయన టాటా సన్స్ కంపెనీలలో వాటాలను కలి గి ఉన్నప్పటికీ రతన్ లాగా ఆయన కూడా వివా హం చేసుకోలేదు. పదవీ విరమణ తర్వాత ఆ యన 2 బెడ్ రూమ్ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఆ యన 25 ఏళ్ల క్రితమే క్రియాశీల వ్యాపారానికి దూరంగా ఉన్నారు. టాటా కొత్త వ్యాపారంతో ఆ యనకి సంబంధం లేదు. ఈ పరిస్థితిలో ఆయన కు ట్రస్ట్ కమాండ్ అప్పగించే అవకాశాలు లేవు.
1868లో టాటా గ్రూప్ ఏర్పడింది..
టాటా గ్రూప్‌ను 1868లో జమ్‌సెట్జీ టాటా స్థాపించారు. ఇది భారతదేశంలో అతిపెద్ద బహుళజాతి కంపెనీ, 10 విభిన్న వ్యాపారాలలో దాని 30 కంపెనీలు ప్రపంచంలోని 100 కంటే ఎక్కువ దేశాలలో వ్యాపారం చేస్తాయి. ప్రస్తుతం ఎన్ చంద్రశేఖరన్ దీనికి చైర్మన్‌గా ఉన్నారు. టాటా కంపెనీల ప్రధాన పెట్టుబడి హోల్డింగ్, ప్రమోటర్ టాటా సన్స్, దీని ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 66% విద్య, ఆరోగ్యం, కళ, సంస్కృతి, జీవనోపాధి కోసం పని చేసే టాటా చారిటబుల్ ట్రస్ట్ ఆధీనంలో ఉంది. 2023-24లో అన్ని టాటా గ్రూప్ కంపెనీల మొత్తం ఆదాయం రూ.13.86 లక్షల కోట్లుగా ఉంది. ఈ గ్రూప్ 10 లక్షల మందికి పైగా ఉపాధిని కల్పిస్తోంది.

ప్రతి భారతీయుడికీ తీరని లోటు: ముకేశ్ అంబానీ
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకే శ్ అంబానీ రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇది భారతదేశానికి చాలా విచారకరమైన రోజు అని అన్నారు. రతన్ టాటా నిష్క్రమణ టాటా గ్రూప్‌కే కాదు, ప్రతి భారతీయుడికీ తీరని లోటు అని అన్నారు. వ్యక్తిగతంగా రతన్ టాటా మరణం నాలో తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు.

దూరదృష్టి కల్గిన నాయకుడు : గౌతమ్ అదానీ
ఆధునిక భారతదేశ మార్గాన్ని పునర్నిర్వచించిన గొప్ప, దూరదృష్టి గల వ్యక్తిని భారతదేశం కోల్పోయింది. రతన్ టాటా కేవలం వ్యాపార నాయకుడే కాదు, ఆయన సమగ్రత, కరుణ, గొప్ప మేలు కోసం తిరుగులేని నిబద్ధతతో భారతదేశ స్ఫూర్తిని మూర్తీభవించారు. ఆయనలాంటి మహానుభావులు ఎప్పటికీ అదృశ్యం కాలేరని అన్నారు.

ఆధునిక వ్యాపారంలో కీలక పాత్ర: సుందర్ పిచాయ్
రతన్ టాటాతో గూగుల్‌లో చివరి సమావేశంలో తాము వేమో పురోగతి గురించి మాట్లాడామని, ఆయన దృక్పథాన్ని వినడం స్ఫూర్తిదాయకంగా ఉంది. భారతదేశంలో ఆధునిక వ్యాపార నాయకత్వాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు.

జీర్ణించుకోలేకపోయాను: ఆనంద్ మహీంద్రా
రతన్ టాటా లేకపోవడాన్ని అం గీకరించలేనని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చారిత్రాత్మకంగా దూసుకుపోతోంది. మన ఈ స్థానంలో నిలవడానికి రతన్ జీవితం, కృషి చాలా దోహదం చేశాయని, ఆర్థిక సంపద, విజయం ప్రపంచ సమాజానికి సేవ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. టాటాను మరచిపోలేము, ఎందుకంటే మహానుభావులు ఎప్పటికీ మరణించరు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News