Friday, December 20, 2024

టెస్లా తొలి సైబర్ క్యాబ్, రోబోవాన్, ఫ్యూచరిస్టిక్ రోబో ల ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ శుక్రవారం తొలి సైబర్  క్యాబ్ ను ఆవిష్కరించారు. టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ తమ ఈవి కంపెనీకి చెందిన ప్రొటోటైప్ డ్రయివర్ రహిత కారును ‘రోబో ట్యాక్సీ ఈవెంట్’ లో ఆవిష్కరించారు.  అమెరికాలో ‘వీ, రోబోట్’ పేరిట వీటిని ఆవిష్కరించారు. తన స్వయంప్రతిపత్తి కార్లు సాంప్రదాయిక కార్లకంటే 10-20 రెట్లు సురక్షితమైనవని అన్నారు. టెస్లా కంపెనీ ‘రోబో వ్యాన్’ అనే రవాణా వాహనాన్ని కూడా ప్రదర్శించింది. ఇదో మాస్ ట్రన్సిట్ లేక కార్గో క్యారియర్ అని పేర్కొన్నారు.  వచ్చే ఏడాదికల్లా టెక్సాస్, క్యాలిఫోర్నియా నగరాల్లో స్వయంచాలిత కార్లను ఆవిష్కరించాలని ఈవి కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 2026 కల్లా సైబర్ క్యాబ్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ డ్రయివర్ లెస్ కార్లలో ప్రజలు పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ లేక పనిచేసుకుంటూ లేక ఏదో విధంగా కాలం గడుపవచ్చు’’ అని ఎలన్ మస్క్ తెలిపారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News