Thursday, December 19, 2024

ఫైరింగ్ ప్రాక్టీసులో ఇద్దరు అగ్నివీరుల మృతి

- Advertisement -
- Advertisement -

నాసిక్ జిల్లాలోని ఆర్టిలరీ సెంటర్ వద్ద ఫైరింగ్ ప్రాక్టీసు సందర్భంగా ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి వచ్చిన షెల్ పేలిపోయి ఇద్దరు అగ్నివీరులు మరణించారు. నాసిక్ రోడ్డు ప్రాంతంలోని ఆర్టిలరీ సెంటర్‌లో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు ఒక పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు. పేలుడులో అగ్నివీరులు విశ్వరాజ్ సింగ్(20), సైఫత్ షిత్(21) మరణించినట్లు ఆయన చెప్పారు. అగ్నివీరుల బృందం ఇండియన్ ఫీల్డ్ గన్ నుంచి ఫైరింగ్ ప్రాక్టీసు చేస్తుండగా ఒక షెల్ పేలిందని ఆయన చెప్పారు. గాయపడిన ఇద్దరు అగ్నివీరులను దేవలాలిలోని ఎంహెచ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారని ఆ అధికారి తెలిపారు. హవల్దార్ అజిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసిన దేవలాలి క్యాంప్ పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News