Friday, November 22, 2024

15న హర్యానాలో బిజెపి సర్కార్ ప్రమాణం

- Advertisement -
- Advertisement -

హర్యానాలో కొత్తగా ఏర్పడనున్న బిజెపి ప్రభుత్వం అక్టోబర్ 15న పంచ్‌కులలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పంచ్‌కులలో ఏర్పాట్లు జరుగుతున్నట్లు సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. అక్టోబర్ 15న ప్రమాణ స్వీకారోత్సవం జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు పంచ్‌కుల డిప్యుటీ కమిషనర్ డాక్ట్ యశ్ గర్గ్ తెలిపారు. ఇందుకోసం వేదికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మనోహర్ లాల్ ఖట్టర్ స్థానంలో ముఖ్యమంత్రిగా మార్చిలో బాధ్యతలు చేపట్టిన ఓబిసి వర్గానికి చెందిన నయాబ్ సింగ్ సైనీ ఎన్నికల్లో పార్టీ గెలుపొందితే

ఆయనే ముఖ్యమంత్రిగా మరోసారి నియమితులు అవుతారని బిజెపి గతంలో సూచించింది. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బిజెపి అగ్ర నాయకులు, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. హర్యానా అసెంబ్లీలోని మొత్తం 90 స్థానాలలో బిజెపి 48 సీట్లను కైవసం చేసుకోగా కాంగ్రెస్ 37 స్థానాలకే పరిమితమైంది. జెజెపి, ఆప్ వంటి పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. ఐఎన్‌ఎల్‌డి మాత్రం రెండు స్థానాలను గెలుచుకోగలిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News