Friday, January 3, 2025

విశ్వంభర టీజర్ ను ట్రోల్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియా మూవీ విశ్వంభర. దసరా సందర్భంగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేసింది. గ్రాండ్‌ విజువల్స్‌తో ఈ టీజర్‌ ను వదిలారు. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులను టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. అయితే, దీనిపై యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వీఎఫ్ క్స్ బాగా లేవని, టీజర్ యాడ్ లాగా ఉందంటూ పనిగట్టుకుని మరి ట్రోల్స్ చేస్తున్నారు. ఇక, దీనికంటే నాగార్జున నటించిన ఢమరుకం మూవీ గ్రాఫిక్స్ బాగా ఉన్నాయంటూ నెగిటీవ్ ప్రచారం చేస్తున్నారు.

అయితే, టీజర్ మాత్రం సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ లు నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. ఇందులో త్రిష, అషికా రంగనాథ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ కోసం ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News