Friday, December 20, 2024

బాబా సిద్ధిఖీని చంపింది మేమే: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

ముంబై: ఎన్సీపి (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, నటుడు సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీ ని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాబా సిద్ధిఖీ శనివారం సాయంత్రం ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా అనేక మంది దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆయనను లీలావతి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ కేసులో అరెస్టయిన హరియాణాకు చెంది కర్నైల్ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన వారమని పేర్కొన్నట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. కాగా మూడో నిందితుడైన యూపీకి చెందిన శివ కుమార్ ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఈ హత్య చేసేందుకు నిందితులకు ఒక్కొక్కరికి బిష్ణోయ్ గ్యాంగ్ రూ. 50000 అడ్వాన్స్, మరణాయుదులు ఇచ్చినట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News