Wednesday, October 16, 2024

ప్రభుత్వ గాంధీ వైద్య కళాశాలకు ప్రొ. సాయిబాబా భౌతిక శరీరం దానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా(58) పార్థీవ శరీరాన్నిఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కు దానం చేశారు. ఆయన కోరుకున్న విధంగానే ఆయన శరీరాన్ని దానం చేస్తున్నట్లు వారు తెలిపారు. అక్టోబర్ 14న ప్రభుత్వ గాంధీ మెడికల్ కాలేజ్ కు ఆయన భౌతిక కాయాన్ని అందజేయనున్నట్లు వారు తెలిపారు.

ప్రొ. సాయిబాబా ఆపరేషన్ అయ్యాక తలెత్తిన సమస్యల కారణంగా మరణించారు. మావోయిస్టులతో సంబంధం ఉందన్న కేసులో ఆయన ఏడు నెలల కిందట విడుదలయ్యారు. ప్రస్తుతం ఆయన భౌతిక కాయం నిమ్స్ మార్చురీ లో ఉంచారు. అక్టోబర్ 14న గన్ పార్క్ కు తీసుకెళతారు.  అక్కడి నుంచి ఆయన సోదరుడి ఇంటికి తరలిస్తారు. అక్కడ ప్రజలు ఆయనకు నివాళులు ఇవ్వడానికి ఉంచుతారు. తర్వాత సంతాప సమావేశం జరుగుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. సాయిబాబా గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ తో బాధపడ్డారు. రెండు వారాల కిందటే ఆయనకు ఆపరేషన్ జరిగింది. కానీ తర్వాత సమస్యలు తలెత్తాయి.  చివరికి శనివారం ఆయన కన్నుమూశారు.

ప్రొఫెసర్ సాయిబాబాకు భార్య, కూతురు ఉన్నారు. ‘‘ తన భౌతిక కాయాన్ని దానం చేయాలని ఆయన ఎన్నడూ కోరుకునేవారు. ఇప్పటికే ఆయన కళ్లను ఎల్ వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కు దానం చేశాము. ఆయన భౌతిక కాయాన్ని కూడా రేపు (అక్టోబర్ 14న) హాస్పిటల్ కు అందజేస్తాం’’ అన్నారు ఆయన కూతురు మంజీర.

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News