Friday, December 20, 2024

కొండా వర్సెస్ రేవూరి

- Advertisement -
- Advertisement -

ఇరువర్గాల ఫ్లెక్సీల రగడ తన అనుచరులపై అకారణంగా
కేసుల నమోదు, దాడులు చేశారని మంత్రి సురేఖ ఆగ్రహం
గీసుగొండ స్టేషన్‌లో పోలీసులతో వాగ్వాదం

మన తెలంగాణ/గీసుకొండ: వరంగల్ పరిధిలో మంత్రి కొండా సురేఖ, ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి వర్గాల మధ్య ఫ్లెక్సీల రగడ చోటుచేసుకుంది. ధర్మారంలో మంత్రి సురేఖ వర్గానికి చెందిన ఫ్లెక్సీ లో స్థానిక ఎంఎల్‌ఎ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఫొటోలు పెట్టకపోవడంతో ఆయన వర్గానికి చెందిన వ్యక్తి మంత్రి కొండా వర్గీయులతో శనివారం గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో పిట్టల అనిల్‌కు గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన రేవూరి వర్గం మంత్రి ఫ్లెక్సీలను చించివేశారు. అని ల్ సోదరుడు భాను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తన వర్గానికి చెందిన బండి రాజ్‌కుమార్, సురేష్, రా జు, శివప్రసాద్, రంజిత్‌కుమార్‌పై అకారణంగా కే సు నమోదు చేసి చితకబాదారంటూ మంత్రి సు రేఖ గీసుకొండ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిపై చర్యలకు భీ ష్మించారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ వచ్చి సర్దిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News