Wednesday, October 16, 2024

థర్డ్ అంపైర్ నిర్ణయంతో భారత్ ఓటమి… మండిపడుతున్న అభిమానులు

- Advertisement -
- Advertisement -

షార్జా: మహిళల టి 20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిని చవిచూసింది. లీగ్ మ్యాచ్ లో 12 పరుగులు తేడాతో ఓడిపోవడంతో క్రికెట్ అభిమానులు అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ బిపై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
17 ఓవర్ లో దీప్తి శర్మ రెండో బంతిని వేయగా ఆసీస్ బ్యాట్స్ మెన్ లిట్చ్ ఫీల్డ్ బంతినిక కొట్టడానికి ప్రయత్నించింది. బంతి ఆమె కాలుకు తగలడంతో భారత ఆటగాళ్లు ఎల్ బి కోసం అప్పీలు చేశారు. వెంటనే ఫీల్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. ఆసీస్ సమీక్షకు వెళ్లగా థర్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు.
బంతి పడక ముందు బ్యాటర్ ఎడమ చేతి నుంచి కుడి చేతికి మారడంతో బంతి ఔట్ సైడ్ పడే అవకాశం లేదని క్రికెట్ పండితులు అభిప్రాయ పడుతున్నారు. థర్డ్ ఎంపైర్ నిర్ణయంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అప్పడే ఔట్ ప్రకటించి ఉంటే ఆసీస్ 140 పరుగులు కూడా దాటే అవకాశం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లిట్చ్ ఫీల్డ్ తొమ్మిది బంతుల్లో 15 పరుగులు చేయడంతో పాటు చివరి బంతి సిక్స్ మలిచింది. ఈ వికెట్ తోనే ఆసీస్ గెలిచిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News