Wednesday, October 16, 2024

తండ్రీ, కుమారులను కత్తులతో బెదిరించి…. అత్తాకోడళ్ల పై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తండ్రీ, కుమారులను కత్తులతో బెదిరించి అత్తా కోడళ్లపై ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరులో జరిగింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్సిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. కర్నాటకకు చెందిన వలస కూలీలు జీవనోపాధి కోసం చిల్లమత్తూరులోని ఓ గ్రామానికి వలస వచ్చారు. తల్లిదండ్రులు, కుమారుడు, కోడలు పేపర్ మిల్లులో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మిల్లు పక్కన రేకుల షేడ్డు వేసుకొని ఉంటున్నారు. గ్రామానికి దూరంగా పేపర్ మిల్లు ఉండడంతో నలుగురే ఉంటున్నారు. దసరా పండుగ రోజున అర్థరాత్రి రెండు గంటలకు ఆరుగురు బైక్ లపై వచ్చారు. తండ్రీ కుమారుడు నిద్ర నుంచి లేచి ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో వారిని కత్తులతో బెదిరించారు. సిసి కెమెరాలను ధ్వసం చేసి అనంతరం ఇంట్లోకి చొరబడి అత్తా కోడళ్లపై  ఆరుగురు సామూహిక అత్యాచారం చేశారు.

అనంతరం వారు వాహనాలపై పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఆరోగ్య పరీక్షల నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గంజాయి మత్తులో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారని ఎస్ పి రత్నం తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్ పికి తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని సూచించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, బిసి సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంఎల్ఎ బాలకృష్ణ కూడా ఎస్ పితో ఫోన్ లో మాట్లాడి బాధితులకు సహాయం చేయడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News