Wednesday, October 16, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. 20 కంపార్టుమెంట్లు ఫుల్..

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమలకు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. సోమవారం శ్రీవారిని దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది.

ఇక, ఆదివారం శ్రీవారిని 86,900 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి 28,739 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.56 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News