Thursday, December 19, 2024

అక్టోబరు 16న నాసిక్‌లో వామపక్ష పార్టీల సమావేశం

- Advertisement -
- Advertisement -

ముంబయి: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు సీట్ల పంపకానికి, ప్రజానుకూల విధానాలకు అంగీకరించాలని వామపక్షాలు, ప్రగతిశీల పార్టీల బృందం మహా వికాస్ అఘాడి నాయకత్వాన్ని కోరింది. వామపక్ష, ప్రగతిశీల పార్టీల బృందం ఆదివారం తమ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది , అక్టోబర్ 16 న నాసిక్‌లో గ్రాండ్ స్టేట్ లెవల్ కన్వెన్షన్‌ను నిర్వహించనుంది. ఈ మహాసభలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది హాజరుకానున్నారు. వచ్చే విధానసభ ఎన్నికల్లో బిజెపి-ఎన్డీయేలను చిత్తుగా ఓడించాల్సిన అవసరాన్ని నాసిక్ సమావేశం పునరుద్ఘాటిస్తుంది.

మహా వికాస్ అఘాడి (MVA-I.N.D.I.A. బ్లాక్) తప్పనిసరిగా ప్రత్యామ్నాయ ప్రజానుకూల విధానాలను ప్రకటించాలని, అన్ని అభ్యుదయ పార్టీలతో సీట్ల సర్దుబాట్లకు కూడా సమ్మిళిత విధానాన్ని అనుసరించాలని గ్రూప్ డిమాండ్ చేసింది. రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు హర్యానాలా జరగకుండా సమగ్రమైన చర్యలు తీసుకోవాలని మహా వికాస్ అఘాడిని వామపక్షాలు, ప్రగతిశీల పార్టీల బృందం కోరింది.

ప్రగతిశీల పార్టీలు మహా వికాస్ అఘాడితో  చర్చలు జరపడానికి ఈ క్రింది నలుగురు నాయకులకు అధికారం ఇచ్చాయి. వారు – జయంత్ పాటిల్, మాజీ MLC (PWP), అబూ అసిమ్ అజ్మీ, MLA (SP), డాక్టర్ అశోక్ ధావలే (CPI-M), డాక్టర్ భాలచంద్ర కాంగో (CPI).

MVA Parties

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News