Wednesday, October 16, 2024

కశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ అధికారాన్ని సవాలుచేసిన పిటిషన్ తిరస్కృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు శాసనసభ సభ్యులను (ఎమ్మెల్యేలు) నామినేట్ చేయడానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి)కి ఇచ్చిన అధికారాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.

న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, పివి సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను స్వీకరించడానికి నిరాకరించింది. పిటిషనర్ రవీందర్ కుమార్ శర్మను ముందుగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ హైకోర్టును ఆశ్రయించాలని తెలిపింది.

పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ, ఎన్నుకోబడని లెఫ్టినెంట్ గవర్నర్ అటువంటి నామినేషన్ ఎన్నికల తీర్పును అడ్డుకోవచ్చని అన్నారు.

జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019 , 2023లో తదుపరి సవరణ బిల్లు లెఫ్టినెంట్ గవర్నర్ కి అదనపు అధికారాలను ఇచ్చింది.  ఇందులో ఐదుగురు సభ్యులను అసెంబ్లీకి నామినేట్ చేయడం… ఇద్దరు మహిళా సభ్యులు, ఒక మహిళతో సహా ఇద్దరు వలసదారులు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి స్థానభ్రంశం చెందిన వ్యక్తుల నుండి ఒక సభ్యుడు ఉంటారు. ఈ ఐదుగురు నామినేటెడ్ సభ్యులకు ఇతర ఎమ్మెల్యేల మాదిరిగానే అధికారాలు, ఓటింగ్ హక్కులు ఉంటాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News