Thursday, December 19, 2024

జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్ట్ కొట్టివేసింది. తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడి కేసులో జానీ మాస్టర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అనంతరం జానీ మాస్టర్‌ను పోలీసుల విచారణ నిమిత్తం కస్టడీకి కోర్టు అప్పగించింది. తాను నేషనల్ అవార్డ్ అందుకోవడాని ఢిల్లీ వెళ్లాల్సి ఉందని, అందుకోసం మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని జానీ కోర్టును కోరగా అందుకు కోర్టు అనుమతినిచ్చింది.

అయితే లైంగిక దాడి కేసు ఎదుర్కొంటున్న కారణంగా జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డ్ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తనకు మరోసారి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో మాస్టర్ తరపున లాయర్ పిటిషన్ వేయగా సోమవారం విచారణ చేపట్టిన కోర్టు, బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కేసు తీవ్రత, బాధితురాలిని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందన్న నార్సింగి పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News