Friday, December 20, 2024

పాకిస్తాన్ ఓటమి.. టీ20 వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్

- Advertisement -
- Advertisement -

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. ఈ మెగా టోర్నీ నుంచి టీమిండియా ఇంటి దారిపట్టింది. సోమవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టుపై ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. అయితే, స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ ను న్యూజిలాండ్ బౌలర్లు మడతపెట్టేశారు.

పాక్ బ్యాటర్స్ కు చెమటలు పట్టించారు. దీంతో పాకిస్తాన్ 11.4 ఓవర్లలో 56 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. పాక్ ను 54 రన్స్ తేడాతో కివీస్ చిత్తు చిత్తుగా ఓడించింది. పాక్ విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత్ కు నిరాశే ఎదురైంది. పాక్ తోపాటు టీమిండియా టోర్నీ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరుకోగా.. తాజాగా న్యూజిలాండ్ బెర్తు ఖరారు చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News