Saturday, December 21, 2024

’మట్కా’ నుంచి ‘లే లే రాజా…’ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’మట్కా’ రిలీజ్ కు రెడీగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ఫస్ట్ సింగిల్ లే లే రాజా విడుదల చేసి మ్యూజిక్ ప్రమోషన్స్‌ని కిక్ స్టార్ట్ చేశారు. జివి ప్రకాష్ కుమార్ మెమరబుల్ రెట్రో పాటను స్కోర్ చేశారు. 70, 80ల స్టైల్‌లోని కంపోజిషన్ థంపింగ్ బీట్‌లతో అద్భుతంగా ఉంది. భాస్కరభట్ల సాహిత్యం రెట్రో అనుభూతిని కలిగిస్తుంది, నీతి మోహన్ వోకల్స్ కట్టిపడేశాయి.

ఈ పాటలో వరుణ్ తేజ్ డిఫరెంట్ గెటప్‌లలో ఆకట్టుకున్నారు. కలర్‌ఫుల్ పబ్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్రీకరించిన పాటలో నోరా ఫతేహి రెట్రో లుక్‌లో అలరించింది. ఎక్స్‌ట్రార్డినరీ డ్యాన్స్ మూవ్స్‌తో సోఫియాగా గ్లామర్ క్వీన్‌లా కనిపించి మైమరిపించింది. జానీ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ వింటేజ్ వైబ్స్‌ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా కనిపించనుంది. నవంబర్ 14న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News