Thursday, December 19, 2024

ఉచిత వాగ్దానాలపై కేంద్రం, ఇసికి సుప్రీంకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఉచిత వాగ్దానాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలిచేందుకు ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు ఇస్తుంటారు. ప్రజలు వాటిని నమ్మి ఓట్లేస్తే.. గెలిచిన తర్వాత ఆ నాయకులు మళ్లీ అటువైపు కూడా చూడరు. హామీలను గాలికొదిలేసి తమకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తుంటారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల ఉచిత వాగ్దానాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత వాగ్దానాలను లంచంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. అటువంటి వాగ్దానాలను అరికట్టడానికి పోల్ ప్యానెల్ వెంటనే చర్యలు తీసుకోవాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఈ క్రమంలో ఉచిత వాగ్దానాలపై కేంద్రం, ఎన్నికల కమిషన్(ఇసి)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించాలని న్యాయస్థానం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News