Saturday, December 21, 2024

పాక్ చేరుకున్న మంత్రి ఎస్ జైశంకర్

- Advertisement -
- Advertisement -

షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) సదస్సులో పాల్గొనేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోకి అడుగుపెట్టారు. గడచిన తొమ్మిదేళ్లలో భారత్‌కు చెందిన విదేశీ వ్యవహారాల మంత్రి పాకిస్తాన్‌లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు క్షీణించిన తరుణంలో జైశంకర్ పాకిస్తాన్ సందర్శన ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజధాని శివార్లలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు జైశంకర్ విమానం ల్యాండింగ్ కాగా సీనియర్ పాకిస్తానీ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

కశ్మీరు సమస్య, పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. బుధవారం జరిగే ఎస్‌సిఓ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి జైశంకర్ సారథ్యం వహిస్తారు. పాకిస్తాన్‌ను చివరిగా సందర్శించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. 2015 డిసెంబర్ 8-9 తేదీలలో ఆమె ఇస్లామాబాద్‌ను సందర్శించారు. అఫ్‌ఘానిస్తాన్‌పై హార్ట్ ఆఫ్ ఆసియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News