Saturday, December 21, 2024

ఎపికి వెళ్లాల్సిందే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోనే తమను కొనసాగించాలని డివొపిటి ఇచ్చిన ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించిన సీనియర్ ఐఎఎస్‌లకు చుక్కెదురైంది. డిఒపిటి ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆంధప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనంటూ మంగళవారం నాడు క్యాట్ కీ లక తీర్పు వెలువరించింది. డిఒపిటి ఉత్తర్వు లు రద్దు కోరుతూ పలువురు ఐఎఎస్‌లు క్యాట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వి చారణ సందర్భంగా క్యాట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఎపిలో ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి చోటుకు వెళ్లి వారికి సేవ చేయాలని మీకు లేదా? ఐఎఎస్‌ల కేటాయింపుపై డిఒపిటికి పూర్తి అధికారాలు ఉ న్నాయి. స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చే సుకునే అవకాశం గైడ్‌లైన్స్‌లో ఉందా? అ ని క్యాట్ ప్రశ్నించింది. వన్ మ్యాన్ కమి టీ సిఫార్సులను డిఒపిటి పట్టించుకోవ డం లేదని ఐఎఎస్ అధికారుల తరపు న్యాయవాది క్యాట్ దృష్టికి తెచ్చారు. సింగిల్‌మెన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కేం ద్రం ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిటీ నివేదికను ఇవ్వలేదన్నారు. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి,

వాణిప్రసాద్, రోనాల్డ్ రోస్‌లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఎపికి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఎపిలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోనికి తీసుకోలేదని తెలిపారు. డిఒపిటి ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనల అనంతరం.. డిఒపిటి ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనల అనంతరం డిఒపిటి ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన క్యాట్ ప్రతివాదులైన కేంద్రం, డిఒపిటిలకు నోటీసులు ఇచ్చింది. నవంబర్ 5 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఎపికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా తెలంగాణలో పనిచేస్తున్న ఎపి క్యాడర్ ఐఏఎస్, ఐపిఎస్‌లను ఎపికి వెళ్లాలని, అలాగే అక్కడ పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్ అధికారులు తెలంగాణకు వెళ్లాలని డిఒపిటి ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. వారంతా ఆయా రాష్ట్రాల్లో అక్టోబర్ 16లోపు రిపోర్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే డిఒపిటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు ఐఎఎస్‌లు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ (క్యాట్)ను ఆశ్రయించారు. డిఒపిటి ఉత్తర్వులను రద్దు చేయాలని వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, సృజన, రోనాల్డ్ రోస్ ఐదుగురు ఐఎఎస్‌లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. తాము ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లలో కోరారు. వీరి పిటిషన్లపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ మంగళవారం విచారణ జరపి ఐదుగురు ఐఏఎస్‌ల అభ్యర్ధనను తోసిపుచ్చింది. వెంటనే డిఒపిటి ఉత్తర్వుల మేరకు వారందరినీ ఆయా రాష్ట్రాలకు వెళ్లాలని ఆదేశించింది.

నేడు హైకోర్టుకు వెళ్లనున్న ఐఎఎస్‌లు.. లంచ్ మోషన్ పిటిషన్ …!?
క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ బుధవారం రాష్ట్ర హైకోర్టుకు ఐఎఎస్‌లు వెళ్లనున్నట్లు సమాచారం. హైకోర్టులో వారు లంచ్ మోషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల సమాచారం. . ఇలా ఉండగా, ఐఎఎస్ అధికారులు మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైకోర్టులో పిటిషన్ వేసే అంశంతో పాటు అక్కడ కూడా తమకు చుక్కెదురైతే పరిస్థితి ఏమిటి? తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది. క్యాట్ తీర్పు మేరకు బుధవారం నాడే ఎపిలో జాయిన్ అయిన తర్వాత కూడా ఇరువురు సిఎంల పరస్పర అంగీకారంతో తిరిగి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు గల అవకాశాలపైనా వారు చర్చించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News