Saturday, December 21, 2024

మంచి థ్రిల్లర్ మూవీ ది డీల్

- Advertisement -
- Advertisement -

ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ది డీల్. ఈ చిత్రాన్ని సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్‌పై డాక్టర్ అనితరావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్స్‌గా నటించారు. ది డీల్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూవీ సమర్పకురాలు డా.అనితారావు మాట్లాడుతూ “ఈ సినిమాతో హనుకి హీరోగా, చందన, ధరణికి హీరోయిన్స్ గా మంచి పేరొస్తుంది. ది డీల్ సినిమా తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుంది”అని తెలిపారు. హీరో, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ “ది డీల్ సినిమాతో దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. మంచి థ్రిల్లర్ మూవీ ఇది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు బసిరెడ్డి, మిర్యాల రవీందర్ రెడ్డి, హీరోయిన్లు చందన, ధరణి ప్రియ, సంగీత దర్శకుడు ఆర్‌ఆర్ ధృవన్, రవి ప్రకాష్, మహేశ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News