Wednesday, October 16, 2024

జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఒమర్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఒమర్ చేత లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పాల్గొన్నారు. ఇండియా కూటమిలోని నేపనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, సిపిఐఎం పార్టీలు 49 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమిలోని శాసన సభా పక్ష నేతల ఎన్‌సి నేత ఉపాధ్యక్షుడు ఒబర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కాంగ్రెస్, ఎన్‌సి నేతలు లెప్టినెంట్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

ఎన్‌సి 42, బిజెపి 29, కాంగ్రెస్6, పిడిపి మూడు, సిపిఐఎం ఒకటి, ఎఎపి ఒకటి గెలుచుకున్నాయి. జమ్మ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 25.63 శాతం, ఎన్‌సికి 23.43 శాతం, కాంగ్రెస్ 11.97 శాతం, పిడిపికి 8.87 శాతం, ఎన్‌పిపికి 1.16 శాతం, సిపిఐఎంకు 0.59, ఆప్‌కు 0.52 శాతం ఓట్లు వచ్చాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News