Friday, December 20, 2024

కేరళ కోర్టులో సురేష్ గోపి బెయిల్ పిటిషన్

- Advertisement -
- Advertisement -

ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల అక్రమ ప్రవర్తన ఆరోపణతో తనపై దాఖలైన కేసులో బెయిల్ కోసం కేంద్ర మంత్రి సురేష్ గోపి కోజికోడ్‌లోని ఒక మేజిస్టీరియల్ న్యాయస్థానంలో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. కేసులో అభియోగాల నమోదు నిమిత్తం బెయిల్ విచారణను వచ్చే ఏడాది జనవరికి కోర్టు పోస్ట్ చేసింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష గోపి భార్య, సోదరుడు బెయిల్ అభ్యర్థనలో ష్యూరిటీలుగా నిలిచారని గోపి న్యాయవాది విలేకరులతో చెప్పారు. దిగువ కోర్టులో విచారణపై నటుడు గోపి కేరళ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కూడా న్యాయవాది తెలియజేశారు.

ఒక స్థానిక టివి చానెల్‌లో పని చేస్తున్న జర్నలిస్ట్ ఫిర్యాదుపై నడక్కవు పోలీసులు నిరుడు అక్టోబర్‌లో ఐపిసి 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నటుడు గోపి వివిధ విలేకరులతో ముఖాముఖి సమయంలో ఆ జర్నలిస్ట్ భుజంపై చేయి వేయడం, ఆమె రెండు సార్లు ఆ చేతిని తోసివేయడం ఆన్‌లైన్‌లో వెలుగు చూసిన వీడియోలో కనిపించిన తరువాత చిక్కుల్లో పడ్డారు. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నటుడు గోపి క్షమాపణ చెప్పారు. తాను ఆప్యాయతతోనే జర్నలిస్ట్ భుజంపై చేయి వేసానని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News