Friday, December 20, 2024

సిఇసి కుమార్‌కు తప్పిన ప్రమాదం

- Advertisement -
- Advertisement -

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న ఒక హెలికాప్టర్‌ను బుధవారం అననుకూల వాతావరణం కారణంగా మున్సియారి సమీపంలో ఒక గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ చేయవలసి వచ్చిందని అధికారి ఒకరు వెల్లడించారు. మిలామ్ హిమానీనదం వైపు వెళ్లేందుకు హెలికాప్టర్ మధ్యాహ్నం సుమారు ఒంటి గంటకు బయలుదేరిందని పిథోరాగఢ్ జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) వినోద్ గిరీష్ గోస్వామి తెలియజేశారు.

అయితే, మేఘావృత వాతావరణం, వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల అది మధ్యాహ్నం సుమారు ఒకటిన్నరకు 42 కిలో మీటర్ల దూరంలోని రాలం గ్రామంలోని హెలిప్యాడ్‌లో దిగిందని ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్ అదనపు ముఖ్య ఎన్నికల అధికారి (ఎఇసిఒ) విజయ్ కుమార్ జోగ్దండే సిఇసి వెంట ఉన్నారని ఆయన చెప్పారు. పైలట్ కాకుండా హెలికాప్టర్లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని, వారంతా సురక్షితమని, మున్సియారికి తిరిగి వచ్చేందుకు అనుకూల వాతావరణం కోసం వారు నిరీక్షిస్తున్నారని డిఎం తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News