Friday, December 20, 2024

నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి 100 మందికి పైగా మృతి

- Advertisement -
- Advertisement -

నైజీరియాలో జిగావా రాష్ట్రం మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పెట్రోల్ ట్యాంకర్ హైవేపై బోల్తాపడి పేలడంతో 100 మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కనో నుంచి బయలుదేరిన ఈ ట్యాంకర్ డ్రైవర్ అదుపు తప్పడంతో బోల్తా పడింది. స్థానికులు కొందరు పెట్రోల్ కోసం ఎగబడ్డారు. పెట్రోలును తీసుకుంటున్న సమయంలో మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే 97 మంది మంటల్లో బూడిదైపోయారు. ట్యాంకర్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించినా ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడడం వల్లనే మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెప్పారు. మరో ఎనిమిది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ చనిపోయారని జిగావా స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధినేత డాక్టర్ హరుణ మరిగ తెలిపారు.

బుధవారం మజియా పట్టణం లోని స్థానికులు మృతదేహాలకు సామూహిక అంత్యక్రియలు చేస్తున్నప్పుడు స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన కొన్ని గంటల తరువాత ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్కడకు వచ్చారు. అప్పటికే ప్రమాదంలో చాలా మంది బూడిదైపోయారని ఎమర్జెన్సీ సర్వీస్ అధినేత మరిగియా తెలిపారు. ఈ ప్రమాద ట్యాంకర్ డ్రైవర్ పొరుగునున్న కనో స్టేట్ నుంచి 110 కిమీ దూరం నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీస్‌లు చెప్పారు. నైజీరియాలో ప్రాణాంతక ట్యాంకర్ సంఘటనలు సర్వసాధారణం. నైజీరియాలో ఇంధనం ధరలు చాలా ఎక్కువ. గత ఏడాది నుంచి పెట్రోలు, డీజిల్ అందుబాటులో ఉండడం లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది ఏదైనా ట్యాంకర్ బోల్తా పడితే పెట్రోల్ కాజేయడానికి మూకుమ్మడిగా వస్తుంటారు. అదీకాక నైజీరియాలో ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా అమలు కావు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News