Thursday, October 17, 2024

12 మంది హైకోర్టు జడ్జీల సస్పెన్షన్

- Advertisement -
- Advertisement -

అవామీ లీగ్ అనుకూల ‘ఫాసిస్ట్ న్యాయమూర్తులను’ తొలగించాలని కోరుతూ విద్యార్థులు సాగిస్తున్న నిరసన ప్రదర్శనల నేపథ్యంలో న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో పాల్గొనకుండా 12 మంది హైకోర్టు న్యాయమూర్తులను బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు బుధవారం సస్పెండ్ చేసింది. వివక్ష వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న వందలాది మంది నిరసనకారులు ‘అవామీ లీగ్ అనుకూల ఫాసిస్ట్ జడ్జీలను’ తొలగించాలని కోరుతూ బుధవారం హైకోర్టు ప్రాంగణాన్ని ముట్టడించిన తరువాత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సయ్యద్ రెఫాత్ అహ్మద్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘ది డైలీ స్టార్’ దినపత్రిక వెల్లడించింది. ’12 మంది (హెచ్‌సి) జడ్జీలకు ఇప్పటికి బెంచ్‌ల కేటాయింపు జరగదు.

అంటే ఈ నెల 20న కోర్టు తిరిగి తెరచుకున్నప్పుడు న్యాయవ్యవస్థ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు వారిని అనుమతించబోరు’ అని ఆ దినపత్రిక సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ జనరల్ అజీజ్ అహ్మద్ భూయాన్‌ను ఉటంకిస్తూ తెలియజేసింది. విద్యార్థులు సుప్రీం కోర్టు ఆవరణలో తమ నిరసన ప్రారంభిస్తూ, అవామీ లీగ్‌తో అనుబంధం ఉన్న, ‘పార్టీ వైఖరికి మద్దతు ఇస్తున్న న్యాయమూర్తులు రాజీనామా చేయాలని కోరినట్లు బిబిన్యూస్24.కామ్ వార్తా పోర్టల్ తెలియజేసింది. సుప్రీం కోర్టు ప్రకటన దృష్టా నిరసనకారులైన విద్యార్థులు తమ ఉద్యమాన్ని ఆదివారం వరకు వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News