పాకిస్థాన్‌తో ముల్తాన్ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఇంగ్లండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. ఓపెనర్లు జాక్ క్రాలి, బెన్ డకెట్‌లు జట్టుకు శుభారంభం అందించారు. ధాటిగా ఆడిన క్రాలి 3 ఫోర్లతో 27 పరుగులు చేసి ఔటయ్యాడు. మరోవైపు బెన్ డకెట్ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఓలి పోప్ (29), జో రూట్ (34)లతో కలిసి డకెట్ కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన డకెట్ 129 బంతుల్లో 16 ఫోర్లతో 114 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
తొలి టెస్టులో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న రూట్, హారి బ్రూక్‌లు ఈసారి నిరాశ పరిచారు. రూట్ 34 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. బ్రూక్ 9 పరుగులు మాత్రమే చేశాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (1) కూడా విఫలమయ్యాడు. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి జేమి స్మిత్ (12), బ్రైడన్ క్రాస్ (2) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ నాలుగు, నొమన్ అలీ రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులకు ఆలౌటైంది. కామ్రాన్ గులామ్ (118), అయూబ్ (77) జట్టుకు అండగా నిలిచారు. కాగా, పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఇంగ్లండ్ మరో 127 పరుగులు చేయాలి.