Thursday, December 19, 2024

కాటేసిన పామును మెడలో వేసుకొని ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి..

- Advertisement -
- Advertisement -

సహజంగా పామును చూస్తేనే వణికిపోతాం.. అలాంటిది దగ్గరికి వచ్చిందంటే.. అక్కడి నుంచి దూరంగా పరుగులు పెడతాం.. కానీ, ఓ వ్యక్తి మాత్రం తనను కరిచిన పామును పట్టుకుని దానిని మెడలో వేసుకుని ఆస్పత్రికి వచ్చాడు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని భగల్పూర్‌లో చోటుచేసుకుంది. ప్రకాశ్ మండల్ అనే వ్యక్తిని అత్యంత విషపూరిత రక్త పింజర పాము కాటేసింది.

అయితే, కాటేసిన రక్త పింజరను ఆస్పత్రిలో చూపించి చికిత్స పొందేందుకు.. దాని నోటిని తన చేతితో గట్టిగా నొక్కి పట్టి, మెడలో వేసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. దీంతో అక్కడున్న రోగులు, డాక్టర్లు భయంతో వణికిపోయారు. తనకు చికిత్స చేయాలని అతను వైద్యులను కోరాడు. అతడిని చూసి వైద్యులు కూడా చికిత్స చేసేందుకు భయపడిపోయినా… చివరకూ ఆ పామును ఓ సంచీలో బంధించి బాధితుడికి చికిత్స అందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News