Thursday, October 17, 2024

గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?:హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘ఒకే దేశం ఒకే పన్ను’, ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’, ‘వన్ నేషన్ ఒకటే రేషన్ కార్డు’, ‘వన్ నేషన్ ఒకటే మార్కెట్’ అని ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ప్రశ్నించారు. గురవారం ఆయన తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. పత్తికి మద్దతు ధర విషయంలో తెలంగాణ రైతులకు మోడీ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. నాణ్యమైన పత్తి పండిస్తున్న తెలంగాణ రైతుల పట్ల వివక్ష ఎందుకు అని అడిగారు. పత్తి మద్దతు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎందుకు ఉందని నిలదీశారు. గుజరాత్ లో క్వింటాకు పత్తి ధర రూ.8257 ఉండగా తెలంగాణలో పత్తి ధర రూ.7521 ఉందని, గుజరాత్ కు ఒక నీతి, తెలంగాణ ఒక నీతా? అని మోడీ ప్రభుత్వానికి హరీష్ రావు చురకలంటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News