Monday, December 23, 2024

‘అయినా పోయి రావాలె హస్తినకు’.. సిఎం రేవంత్ పై కెటిఆర్ సెటైర్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కెటిఆర్ మరోసారి విమర్శలు చేశారు. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలపై ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు.

” ‘పైసా పనిలేదు-రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. 10 నెలలు.. పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి.. తట్టా మట్టి తీసింది లేదు.. కొత్తగా చేసింది అసలే లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు’, ‘అన్నదాతల అరిగోసలు.. గాల్లో దీపాల్లా గురుకులాలు.. కుంటుపడ్డ వైద్యం.. గాడి తప్పిన విద్యా వ్యవస్థ.. అయినను పోయి రావాలె హస్తినకు’, ‘మూసి- హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి.. 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి..అయినను పోయి రావాలె హస్తినకు’, ‘పండగలు పండగళ్ళా లేవు.. ఆడబిడ్డల చీరలు అందనేలేవు.. అవ్వాతాతలు అనుకున్న పింఛను లేదు.. తులం బంగారం జాడనే లేదు.. స్కూటీలు లేవు, కుట్టు మిషిన్లు లేవు..అయినను పోయి రావాలె హస్తినకు’ ” అంటూ కెటిఆర్ ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News