Friday, December 20, 2024

యావరేజ్ సినిమా ‘వేట్టాయన్’

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘వేట్టాయన్’(వేటగాడు) ఓ మోస్తరుగా ఆడుతోంది. ఈ సినిమాలో ప్రత్యేకించి చెప్పుకోడానికి ఏమి లేదు. ఓ మూస సినిమా ఇది. అయితే ఇప్పటికే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లే రాబట్టింది. ఈ సినిమా అక్టోబర్ 10న విడుదలయింది. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, రోహిణి, ధుష్రా విజయన్, రితికా సింగ్, శర్వానంద్ తదితరులు నటించారు. దసరా తర్వాత ఈ సినిమా టిక్కెట్ల రేట్లు మునుపటికన్నా తగ్గించారు.

సినిమాలో కొత్త దనమేది కనిపించదు. కథలో అంత దమ్ములేదు. ఇదివరకు ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. కాకపోతే నటీనటులంతా బాగానే నటించారు. చెప్పుకోదగ్గ పాటలు, డ్యాన్సులు ఉండవు. అంతా డైలాగులు, డిష్యుండిష్యుంలే. సినిమా ఓ మోస్తరుగా ఉంటుంది. చూడమనయితే చెప్పలేం.

రివ్యూ: అశోక్

రేటింగ్: 2.5/5

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News