Saturday, November 23, 2024

కెసిఆర్, కెటిఆర్,హరీశ్, ఈటల, కిషన్ రెడ్డిలకు సిఎం మెలిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి నేతలు కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావులతో పాటి బిజెపి నాయకులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ లకు ముఖ్యమంత్రి కండిషనల్ విజ్ఞప్తి చేశారు.‘‘మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఖాళీ చేసిన ఇళ్లలో మూడు నెలలు ఉండండి..మీరుంటే ఆ అద్దె నేనే కడతాను..మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయండి..మీకు అన్ని సౌకర్యాలు కల్పించమని అధికారులను ఆదేశిస్తున్నా.  మీరు మూడు నెలలు అక్కడ నివసిస్తే ప్రాజెక్ట్ ను అర్ధాంతరంగా ఆపేస్తాం. టెండర్ అగ్రిమెంట్ కి నష్టం జరిగితే నా సొంత ఆస్తి అమ్మి కడతా’’ అంటూ రేవంత్ సవాల్ విసిరారు. విపక్షాలు చేసే సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు.

సచివాలయంలో మూసీ ప్రాజెక్ట్ పై రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రాజెంటేషన్ ఇచ్చారు. చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని, మూసి నది పునరుజ్జీవమని అన్నారు. మూసీ నది కాలుష్యానికి ప్రతీకగా మారిందన్నారు. 1600కు పైగా కుటుంబాలు మూసీ నది మధ్యే నివాసం చేసుకున్నాయన్నారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News