- Advertisement -
గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడికి దిగింది. తాత్కాలిక శిబిరంగా ఉన్న ఓ పాఠశాలపై జరిపిన వైమానిక దాడిలో 15 మంది మృతి చెందినట్టు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్టు తెలిపింది. జబలియా లోని అబుహుస్సేని స్కూల్ వద్ద జరిపిన దాడిలో డజన్ల మంది గాయపడ్డారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. వీరిలో అనేక మంది మహిళలు, చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు పాఠశాల వద్ద గుమిగూడిన హమాస్, ఇస్లామిక్ జిహాద్ మిలిటెంట్లే లక్షంగా దాడి చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది.
- Advertisement -