Friday, December 20, 2024

రేపు నాంపల్లి కోర్టుకు కెటిఆర్ హాజరు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాంపల్లి కోర్టుకు శుక్రవారం హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేసులో ఆయన హాజరు కానున్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఈ నెల 18వ తేదీన రికార్డు చేయాలని కోర్టు ఆదేశించ డంతో శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు. తనపై వివాదాస్పద వ్యాఖ్యలను కొండా సురేఖ చేసినందున ఆమెపై పరువు నష్టం దావాను వేశారు.

దీనిపై ఈ నెల 14వ తేదీన విచారణ జరిపిన న్యాయస్థానం 18వ తేదన స్టేట్‌మెంట్ ను రికార్డు చేయాలని చెప్పడంతో ఆయన హాజరు కావాల్సి ఉంటుంది. కెటిఆర్‌తో పాటు ఈ కేసులో బిఆర్‌ఎస్ నేతలు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజు శ్రావణ్‌ల సాక్ష్యాలను కూడా రికార్డు చేయనున్నారు. వారు కూడా నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News