Thursday, December 19, 2024

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా పూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సుకు బైక్ డీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. చన్‌గోములు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పూడూరు మండలం మేడికొండ గ్రామానికి చెందిన నవీన్‌కుమార్ (21), హర్షవర్థన్ (15), గొంగుపల్లికి చెందిన ఎం.ప్రవీణ్ (20) వీరు ముగ్గురు కలిసి గురువారం ఉదయం బైక్‌పై మేడి కొండ నుంచి మన్నెగూడకు వస్తున్నారు.

ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న హైదరాబాద్ నుంచి పరిగి మీదుగా సేడం వెళ్తున్న ఆర్టీసీ బస్సును పూడూరు స్టేజీ సమీపంలో ద్విచక్రవాహనంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మెడికొండకు చెందిన నవీన్‌కుమార్, హర్షవర్థన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రవీణ్‌కు తీవ్ర గాయాలు కాగా వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా ఎస్సీ నారాయణరెడ్డి, పరిగి డిఎస్పీ కరుణసాగర్‌రెడ్డి, సిఐ శ్రీనివాస్‌లతో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి రోడ్డు ప్రమాదం జరిగిన వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News