Thursday, December 19, 2024

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విషయంలో త్వరలో నిర్ణయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విషయంలో త్వరలోనే ని ర్ణయం తీసుకుంటామని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ చెప్పారు. గ్రూప్-1 పరీక్ష వాయిదా వేయాలని, జీఓ 29 రద్దు చేసి జీఓ 55 అమలు చే యడం వంటి తదితర అంశాలపై ఆం దోళన చే స్తున్న గ్రూప్-1 అభ్యర్థులతో గురువా రం గాంధీ భవన్‌లో పిసిసి చీఫ్ సమావేశం కావడంతో
పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు చెప్పిన విషయాలపై అధికారులతో మాట్లాడతానని ఆయన వారికి హామీనిచ్చారు. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత తమది ఆయన వారికి హామీనిచ్చారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిరుద్యోగుల పట్ల కెటిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్న మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన సవాల్ విసిరారు. మీరిచ్చిన ఉద్యోగాలు 40 వేలు కూడా దాటడం లేదన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. తాము వచ్చిన 9 నెలల్లోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నామని ఆయన తెలిపారు. కెసిఆర్ రూ.7.5 లక్షల కోట్లు అప్పు చేసి తమ నెత్తిన పెట్టి వెళ్లారని, మిగులు బడ్జెట్‌ను అప్పుల పాలు చేశారని ఆయన దుయ్యబట్టారు. నిరుద్యోగుల పట్ల బిఆర్‌ఎస్, బిజెపి నాయకుల చిత్తశుద్ధి ఏమిటో నిరుద్యోగులు తెలుసుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News