Thursday, December 19, 2024

లైంగిక వేధింపుల కేంద్రంగా ఈషా ఫౌండేషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హిమాయత్‌నగర్: అంత ర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈషా ఫౌండే షన్ ఆధ్యాత్మిక ముసుగులో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడే కేంద్రంగా ని లుస్తోందని మాజీ అధ్యాపకులు యామిని రాగాని, మాజీ ప్రాంతీయ కమిటీ సభ్యులు (ఏపి,టిజి) సత్య ఎన్ రాగాని ఆరోపించా రు. గురువారం బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మా ట్లాడుతూ ఆశ్రమ నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారని మండిపడ్డారు. ఈషా ఎ డ్యూకేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలు, ఈషా విద్య, సంస్కృతి, హోమ్ స్కూల్‌లో 8 వేలకు మందికి విద్యార్థులు విద్యను అభ్యసిస్తు న్నారని చెప్పారు. బాలికలపై జరిగే నేరాలకు ఈషా ఫౌండేషన్, ఎడ్యుకేషన్ మేనేజ్ మెంట్, ట్రస్టీలు ముఖ్యంగా వ్యవస్థాప కుడు జగ్గీ వాసుదేవ్ (సద్గురు) బాధ్యత వహి స్తారా అని ప్రశ్నించారు.

ఈషా సెంటర్‌లో విద్యా కార్యక్రమాల పేరుతో ఈషా సం స్కృతికి చెందిన బాలికలను అర్ధనగ్నంగా ఆధ్యాత్మిక దీక్షలకు గురుచేస్తున్నారని ఆరో పించారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తాను సాక్షాత్కారమైన ఆత్మ అని, కరుణతో నిండి ఉన్నానని ఈషా సం స్కృతి, హోమ్ స్కూల్ విద్యార్థులపై జరుగుతున్న అకృత్యాలపై ఎప్పుడు మాట్లాడటం లేదన్నారు. జూన్ 21, 2024 అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున 12వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడి మరణం కూడా యాజమాన్యం నిర్లక్షం వల్లే జరిగిందని చెప్పారు. విద్యాబోర్డులు నిర్ధేశించిన మార్గదర్శకాలను పాటించకుండా మానవ సంక్షేమం ముసుగులో ఈషా ఫౌండేషన్, ఎడ్యుకేషన్ చేస్తున్న దురాగతాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News