Friday, December 20, 2024

సల్మాన్ ఖాన్ ను చంపేస్తాం.. ముంబయి పోలీసులకు వాట్సప్ మెసేజ్

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ చంపేస్తామని ముంబయి పోలీసులకు వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ ముంబయి పోలీసులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సందేశాలు పంపినట్టు సమాచారం. లారెన్స్ బిష్ణోయ్‌తో శత్రుత్వం ముగించాలనుకుంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే సల్మాన్‌ను సిద్ధిఖీ కంటే దారుణంగా చంపుతామని హెచ్చరించారు. వాట్సప్ మెసేజ్‌పై ముంబయి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) సీనియర్‌ నేత, సల్మాన్‌ఖాన్‌ స్నేహితుడు బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో విజయ దశమి రోజున బాంద్రాలో సిద్దిఖీపై ముగ్గురు దుండగులు కాల్పులు జరపడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News