Friday, January 3, 2025

మియాపూర్‌లో హరీష్ రావు బంధువులపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ మల్కాజ్ గిరి: మాజీ మంత్రి హరీష్‌రావు బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మియాపూర్‌లో వారిపై ట్రెస్‌పాస్, చీటింగ్ కేసు నమోదు చేశారు. దండు లచ్చిరాజు ఐదంతస్థుల భవనంలో హరీష్‌రావు బంధువులు
తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావు  అక్రమంగా వచ్చి ఉంటున్నారు. మియాపూర్‌ పోలీస్ స్టేషన్ లో దండు లచ్చిరాజు ఫిర్యాదు చేయడంతో తన్నీరు గౌతం, బోయినిపల్లి వెంకటేశ్వర రావు, గోని రాజకుమార్ గౌడ్, గారపాటి నాగరవి, జంపన ప్రభావతి, తన్నీరు పద్మజారావులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్‌ పేరుతో ట్రెస్‌పాస్‌ బ్లాంక్‌ చెక్‌, బ్లాంక్‌ ప్రామిసరీనోటు తీసుకుని హరీష్‌రావు బంధువులు చీటింగ్‌కు పాల్పడ్డారు. తనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని జంపన ప్రభావతిపై లచ్చిరాజు ఆరోపణలు చేశారు. తనకు వ్యతిరేకంగా ఇంజంక్షన్‌ ఆర్డర్‌ తెచ్చారని ఆరోపణ చేశారు. ఈ విషయంపై 2019 నుంచి లచ్చిరాజు పోరాడుతున్నారు. తనకు తెలియకుండానే తన ఇంటిని హరీష్ రావు  బంధువుల అమ్మేశారని లచ్చిరాజు ఆరోపణలు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News