Monday, December 23, 2024

ఇంగ్లండ్‌కు షాక్…. పాక్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ముల్తాన్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య పాకిస్థాన్ 152 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాకిస్థాన్ సిరీస్‌ను 11తో సమం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ తొలి టెస్టులో రికార్డు విజయాన్ని సొంతం చేసుకుంది. 297 పరుగుల లక్షంతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో పాకిస్థాన్ బౌలర్లు సఫలమయ్యారు. నొమన్ అలీ, సాజిద్ ఖాన్‌లు కలిసి ఏకంగా 20 వికెట్లను పడగొట్టి పాకిస్థాన్‌కు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో నొమన్ అద్భుత బౌలింగ్‌తో అలరించాడు. 46 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లను పడగొట్టాడు. సాజిద్ ఖాన్‌కు రెండు వికెట్లు లభించాయి. వీరి ధాటికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (37), బ్రైడన్ కార్సె (27), ఓలి పోప్ (22) పరుగులు చేశారు. మిగతావారు విఫలం కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News