Thursday, December 19, 2024

విద్యార్థులు పరీక్ష ఎలా రాస్తారు?.. సర్కార్ పునరాలోచించాలి: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థులు, నగరంలోని అశోక్ నగర్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అశోక్‌నగర్‌ చౌరస్తాకు వెళ్లిన బండి సంజయ్‌.. గ్రూప్‌-1 బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “వారం రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఆ మైండ్ సెట్‌తో ఎల్లుండి పరీక్ష ఎలా రాస్తారు?. మహిళల్ని, గర్భిణీలను కొడుతున్నారు.. ఇది దాష్టీకానికి నిదర్శనం. జీవో 29పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలి. నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు… వీళ్ళ ఆందోళనకు సంబంధం” లేదు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News