Saturday, December 21, 2024

అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. స్పీడ్ పెంచిన అఖిల్

- Advertisement -
- Advertisement -

అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత వెండి తెరకు కాస్త బ్రేక్ ఇచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం తన కొత్త సినిమాలపై ఫోకస్ పెట్టిన అఖిల్.. తాజాగా 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.

ఈ సినిమాకు యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. దీంతోపాటు ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిశోర్ డైరెక్షన్‌లో మరో మూవీకి ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తుందని సినీ సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, నాగ చైతన్య నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు తండేల్ ఈ సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News