Saturday, December 21, 2024

చార్మినార్ లో పోలీసుల స్థలం కబ్జా..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఎంతోమంది సామాన్య ప్రజలు తమ స్థలాలను కబ్జా చేశారని.. తమకు న్యాయం చేయండంటూ పోలీసులను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. కానీ, ఇక్కడ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన స్థలాన్నే కబ్జా చేశారు. ఈఘటన చార్మినార్‌ పిఎస్ పరిదిలో చోటుచేసుకుంది.

చార్మినార్‌ పోలీస్టేషన్‌ నిర్మాణం కోసం కేటాయించిన 700 గజాల స్థలం కబ్జాకు గురైంది. అంతేకాదు.. కబ్జా చేసి దర్జాగా నిర్మాణం కూడా చేపట్టారు. పనులు ఆపాలని చెప్పినా వినకుండా పోలీసుల హెచ్చరికలు లైట్ తీసుకున్నారు కబ్జాదారులు. దీంతో స్థలం కబ్జా చేసిన వారిపై చార్మినార్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News