- Advertisement -
ఒట్టావా: భారత్ తో దౌత్య సంబంధాలు దెబ్బతింటున్నా కెనడా వైఖరిలో మార్పు కనపడ్డంలేదు. తాజాగా కెనడాలో ఉన్న మిగిలిన దౌత్యవేత్తలపై నిఘా ఉంచినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. అంతేకాక భారత్ ను రష్యాతో పోలుస్తూ ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు.
సిక్కుల అతివాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చింది. కెనడా తాజాగా భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ‘‘మిగిలిన భారత దౌత్యవేత్తలను కూడా బహిష్కరిస్తారా?’’ అని ప్రశ్నించినప్పుడు ‘‘వారిపై నిఘా ఉంచాం. ఒట్టవా హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించాం’’ అన్నారు.
- Advertisement -