Friday, December 20, 2024

ఆమరణ నిరాహార దీక్ష విరమించాలి.. జూడాలకు మమత విజ్ఞప్తి

- Advertisement -
- Advertisement -

ఆమరణ నిరాహార దీక్షను విరమించవలసిందిగా జూనియర్ డాక్టర్లకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. వారి డిమాండ్లపై మరింతగా చర్చించేందుకు వారిని తాను సోమవారం కలుసుకుంటానని మమత ప్రకటించారు. ఆర్‌జి కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో తమ సహచరురాలిపై హత్యాచార ఘటనపై నిరసన సూచకంగా జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ధర్మతల ప్రదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మనోజ్ పంత్ శనివారం మధ్యాహ్నం సందర్శించిన తరువాత వారితో మమత ఫోన్‌లో మాట్లాడారు.

‘ప్రతి ఒక్కరికీ నిరసన తెలియజేసే హక్కు ఉంది, కానీ అది ఆరోగ్య సేవలకు అంతరాయం కలిగించరాదు’ అని ఆమె అన్నారు. డాక్టర్లు తమ ఆందోళన విరమించాలని మమత కోరారు. ‘మీ డిమాండ్లలో చాలా వాటిని నెరవేర్చడమైంది. తక్కిన డిమాండ్లు తీర్చడానికి నాకు మరి మూడు నాలుగు నెలల వ్యవధి ఇవ్వండి’ అని మమత అన్నారు. తమ డిమాండ్లతో తాను విభేదించడం లేదని డాక్టర్లతోచెప్పిన మమత తన ప్రభుత్వంతో చర్చలకు రావలసిందని వారికి విజ్ఞప్తి చేశారు. జూనియర్ డాక్టర్లను కలిసిన పంత్ వెంట రాష్ట్ర హోమ్ శాఖ కార్యదర్శి నందినీ చక్రవర్తి కూడా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News